కునలమ్మ పదాలు;-చంద్రకళ యలమర్తి
 1.
దీపాలు వెలిగించు
పాపాలు తొలగించు
లోకాలు మెరిపించు
ఓ ధృవ చంద్రా 
2.
ఉపవాస దీక్షలు
ఆరోగ్య రక్షణలు
దక్కేను మోక్షాలు
ఓ ధృవ చంద్రా 
3
చదివేటి  ఆకథలు
మార్చేటి పాఠాలు
చక్కటి  సాధనాలు
ఓ ధృవ చంద్రా 
4
పత్రితో పూజలను
జలాభిషేకాలను
పళ్ళ నైవేద్యాలను
ఓ ధృవ చంద్రా 
5
వనాల భోజనాలు
ఎన్నెన్నొ దానాలు
దక్కేను పుణ్యాలు
ఓ ధృవ చంద్రా 
*---*


కామెంట్‌లు