సుప్రభాత కవిత ; బృంద
వసంతపు దారుల్లా
హృదయం పరచి

సురలోక సీమలా
ముస్తాబు చేసి

మురిపించే ముచ్చటైన
విరిబాలల  నవ్వులతో

మమతల పూలు దూసి
అనురాగమాలలల్లి

మదిని దాచిన మౌన వీణ
కదలి  రాగాలు  పలికించగా

నయగారాల గారాలతో
సరాగాల స్వాగతం పలికి

పలుకరించే ఆనందాల  పులకరింపులకు

గుండె గూటికి పండగొచ్చినట్టు
కొండ చాటున తొంగి చూస్తున్న...

ధరను దయతో కరుణించ  
గగన సీమల పయనించ

అరుదెంచే ఆప్త మిత్రునికి  
ఆనందభరిత ఆలింగనంతో

ఆలపించిన ప్రియభావనల
ఆలకించి  అనుగ్రహించమని 

అవనిపాడే

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు