సుప్రభాత కవిత ; -బృంద
రేయంతా చీకటిని మధిస్తే
పుట్టిన కాంతి కలశంలా
పైకొచ్చిన సూర్యబింబం
జగతికందిన వేకువ వెలుగు.

అమృతంలాటి అనుగ్రహాన్ని
అవనిపై కురిపిస్తూ...
అణువణువూ చైతన్యం 
నింపుతూ...

మొక్కలు చేసిన మొగ్గల
సేద్యం....ముగిసి
ముచ్చటగా పండిన 
పువ్వుల నవ్వుల పంట

కొండాకోనల గుండెల్లో
మారుమోగే నిశ్శబ్దం ..
వెలుగుల సందడితో
నిండిన పచ్చని లోయలు

శరణంటున్న ఇలను
కరుణించిన కిరణాలు
చిత్రవర్ణ రేఖలతో
హరివిల్లై విరిసిన భూతలం

మళ్లీ  వచ్చిన ఉదయం
మోసుకు వచ్చిన ఆనందం
మనసున్న కళ్ళకే తోచే
అపూర్వమైన అద్బుతం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు