సుప్రభాత కవిత ; -బృంద
గతమైన ఆనందాలూ
జ్ఞాపకాలైన  సంతోషాలూ

శిలల్లా మారిన కలతలూ
అలల్లా ఆగని ఆలోచనలూ

అంతే తెలియని సమస్యలు
చింతే తరగని తలపులు

అన్నిటికీ పరిష్కారం 
రానున్న రేపు....

చిరునవ్వు చెదరనీయక
చిన్ని మదిని బెదరనీయక

కంటి  చెమ్మ ఊరనీయక
ఆశ వెలుగు ఆరనీయక

ఆకు రాలిన చోటే కొత్త చివురులా
శిశిరమవగానే వసంతంలా..

ప్రతిరోజొక కొత్త ఉదయం
మొదలవునిక కొత్త అధ్యాయం

మాపున కమ్మిన చిమ్మచీకట్లను
వేకువనే వెలుగులతో చిమ్మేసినట్టు

మనసు మూలల కలతలన్నీ
మరచిపోయి  మనసుతీర

ఉదయకాంతుల వెలుగుతున్న
కాంతులీను లోకం చూసి

హృదయభావన భావగీతిగ
బృంద పాడే 


🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు