నంద్యాలలోని జలవనరుల శాఖలో తెలుగుగంగ ప్రాజెక్టు కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. రత్నలక్ష్మి గారు లిటరేచర్ కేటగిరిలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచి ప్రెస్టీజియస్ వైశ్య లైమ్ లైట్ అవార్డు ఫర్ వుమెన్ - 2022లో ఎక్సలెన్స్ అవార్డు ఆఫ్ ద ఇయర్ ఇన్ లిటరేచర్ పురస్కారాన్ని అందుకున్నారు. వారు సాహిత్య రంగంలో చేసిన ఎనలేని విశిష్ట సేవలను, అత్యున్నత కృషిని అభినందిస్తూ, విజేతగా నిలిచి పలు అవార్డులను, పురస్కారాలను పొందిన సందర్భాన్ని ఉటంకిస్తూ హైదరాబాద్ ఫిలింనగర్ జె ఆర్ సి కన్వెన్షన్స్ లో శనివారం రాత్రి ఇమ్మడి శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఓలేటి దామోదర్ గుప్తా తదితరుల సమక్షంలో ఓఎన్ఎస్ అధినేత శివకుమార్ ఇమ్మడి గారు, మానేపల్లి జ్యువెలర్స్ మరియు ప్రణవ గ్రూప్ అధినేతల స్వహస్తాలమీదుగా వారికి అత్యున్నత పురస్కారాన్ని మరియు బంగారపు బ్యాడ్జిని బహుకరించి అంగరంగ వైభవంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఉన్నతాధికారులు, మరియు బంధుమిత్రులు అభినందనలు తెలియజేశారు.
ఎస్. రత్నలక్ష్మికి ప్రెస్టీజియస్ వైశ్య లైమ్ లైట్ అవార్డు
• T. VEDANTA SURY



addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి