సుప్రభాత కవిత ;-బృంద
ఒక్క ఉదుటున 
తాకిన వెలుగుకు
నక్కి నక్కి కనుమరుగైన
చిక్కని చీకటి

వెలితి తెలియని
విరుల బాలలు
రెక్కల దుప్పటి తీసి
నవ్వులు రువ్వుతూ

అరకొరగా అడ్డగించి 
ఆటలాడే శాఖల మధ్యన
సూటిగ చూసిన సూరీడి
చూపుకు సిగ్గుల మొగ్గాయెను

తెల్ల కలువల మాలికలా
నింగిన సాగే మేఘమాల
అందమైన ముచ్చట చూసి
అందరికీ  చేరవేసెను

నిశికి సెలవిచ్చి ఉష రాకతో
ప్రకృతికి పండగొచ్చి
పులకరించి పరవశంగా
మౌనమే పల్లవై  పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు