అతనికాలానికి పూర్తిగా ;-కోరాడ నరసింహా రావు, కవి, రచయిత,రంగస్థలకళాకారులు విశాఖపట్నం.

   భ్రష్టుపట్టిపోయినఆచార,
సాంప్రదాయాల  మూఢ నమ్మ  కాలతో సామాజిక అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం గురజాడ చేస్తే.... 
 నేడు నైతికవిలువల పతనం తో, విచ్చలవిడితనంతో... భ్రష్టు పట్టిపోతున్న సమాజాన్ని చక్కని బోధన,ఉపన్యాసాలతో 
ఈ సమాజాన్ని సంస్కరించే ప్రయత్నం చాగంటి చేస్తున్నారు 
 సమాజానికి మంచి జరిగే  పని ఎవరు చేసినా స్వాగతించవల సిందే !
  వారుచేస్తే,చెడు.. మంచైపోదు 
వీరుచేస్తేమoచిచెడూ ఐపోదు !
  చాగంటి ఉపన్యాసాలతో చెడిపోయి,సమాజానికి సవాల్ 
గా మారిన వారుగాని, అరాచ కాలు సృష్టిస్తున్న వారుగానీ యే ఒక్కరైనా ఉంటే...,ఈ అవార్డు ఇవ్వటం తప్పే... !
  సమాజాన్ని సంస్కరించటమంటే... కేవలం తిరగబడమని ప్రేరేపించటమే కాదు..., సామరస్యధోరణిలో వాళ్లలో చెడును తొలగిస్తూ మంచిని మేల్కొల్పటo కూడా !
సమాజహితంకోసం ప్రయత్నించే యే వ్యక్తికి  ఆ అవార్డు ఇచ్చినా ఆమోదించి  సంతోషించవలసిందే !
అక్కడ... ఈ వర్గానికిచ్చారా, ఆ వర్గానికిచ్చారా.. అంటూ వర్గ విభజన చేసి విద్వత్తును, మంచితనాన్ని కించపరిచే పని చెయ్యకూడదు !
********

కామెంట్‌లు