సుప్రభాత కవిత ; -బృంద
అడుగుఅడుగునా
వెలుగుల మడుగులు

కలతల కంచెలు దాటిస్తూ
కరువుల ఛాయలు చెరిపేస్తూ

ఆశల పందిరి  అల్లేస్తూ
ఆనందం గుమ్మరిస్తూ

నిరాశల నీడలు తప్పిస్తూ
నిస్వార్థం అలవాటు చేస్తూ

దిగుళ్ళ బరువు దించేస్తూ
వ్యధలెన్నటికీ  వద్దంటూ

రేపటిపై ఆరాటం పెరిగేలా
నేటి క్షణాలు రసవంతాలయేలా

అడుగుకు ఆధారంగా
ఆలోచనలకు ఆసరాగా

అపారంగా అనవరతంగా
ఆకాశంనుండీ  అనుగ్రహం

అంచెలంచెలుగా  
అవసరమైనంత

వర్షించే వేలుపు తోడుంటే
ఆశించిన  సౌఖ్యాలు అందవా??

అడగాలని అనుకోక
అర్హతకు తగిన ఫలితమిచ్చే

అంతర్యామి  వరమిస్తే
అడ్డంకులు ఎన్నుంటే ఏం?

అడుగేస్తే  అందేసే ఆనందాలు సొంతమయే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు