సుప్రభాత కవిత ; -బృంద
ఇలను తాకిన ఇనుడి ప్రేమకు
అవని అణువణువూ  
పొంగి ప్రభవించు
పులకరింపుల పరవశాలు

గుమ్మరించే వెలుగుల్లో
గుబాళించే పువ్వులు
కొండమల్లెల పరిమళం
కొని తెస్తున్న  మలయానిలం

తీగ పెదవులపై తాజాగా
మెరిసే అందమైన 
సంతోషపు నవ్వుల్లా
అరవిరిసిన పువ్వులు

చైత్రవీణ పలికించే
వసంతరాగానికి
తలలూపే తరువుల 
తాదాత్మ్యం

గుండెలో సంతోషాలను
కువకువమంటూ  గువ్వలు
ఆలకించి ఆనందంతో
ఆకుల గలగలల చప్పట్లు

క్షణానికో రంగుమారుతూ
నింగిలో మబ్బుల పరుగులు
ప్రణవం పలుకుతున్న
పర్వత పంక్తులు

అంతెరుగని అనుబంధం
అంబరంతో కూడా కొలవలేని
అనురాగం 
అవనిదీ..... అరుణోదయానిదీ

వెలుగు గుప్పెట చిక్కిన
జగతికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు