మాజిక్! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా ఆరోజు ఇంకో ట్రిక్ చూపుతున్నాడు. హరిని అడిగాడు "నీకు ఇష్టమైన దేవుని పేరు చెప్పు". "సాయిబాబా " సరే అని ఓ పదిమంది ని వారి ఇష్ట దేవతలపేర్లు అడిగి రాశాడు కొన్ని కాగితం ముక్కలపై.ఆపై గిరిని పిల్చి ఓకాగితం ముక్క మడతపెట్టింది తీసుకోమన్నాడు.ఆపై ఆకాగితంముక్కల్ని అందరిముందూ అగ్గిపుల్లతో గీషి బూడిద చేశాడు.ఆబూడిద వెతుకుతూ కాసేపు ఆలోచించి "గిరీ! నీచేతిలో ఉన్న చీటీలో సాయిబాబా  అని ఉంది కదూ? చీటీ తెరచి చూడు" అన్నాడు. అరె!నిజంగానే బాబా పేగుంది.
శివా చేసిన ట్రిక్ ఏంటో తెలుసా?అన్ని కాగితం ముక్కల పై సాయిబాబా అని రాశాడు.ఇలా మోసగాళ్ళు అమాయకులని మోసం చేస్తారు మాయమాటలతో అని శివా అనగానే  పిల్లలంతా చప్పట్లు కొట్టారు 🌹
కామెంట్‌లు