ఆ ..మోజులో ...!!------డా.కె.ఎల్ వి ప్రసాద్
 పేస్ బుక్ లో 
పోస్టు చూడగానే 
వాట్స్ ఆప్ లో 
చాట్ కనపడగానే 
"పొనీలే" లైకులు ..
పోగులు --
పడిపోతాయ్ !
"జాలిపడి" పెట్టే 
ఇమోజీలు ..
కుప్పలుతెప్పలవుతాయ్ !
చదివారో ..లేదో ..తెలీదు 
చదవనివాళ్లే ఎక్కువగా 
చేసేది 
ఈ ..స్పీడు పనులు ..!
చదివితే ---
కామెంటు పెట్టాలి 
లేకుంటే 
అలావదిలేయ్యాలి ..
అదే రాసినవాడికి 
మహా తృప్తి ....!
మీ లైకులకో దండం ...
మీ ఇమోజీలకూ ...
అంతకంటెపెద్దదండం ........!!
         ***

కామెంట్‌లు