జరిగే తీరుతుంది...!@(చిత్రకవిత ) కోరాడ నరసింహా రావు.. !
అమ్మ, అయ్య... కూలికి పొతే 
చెల్లి బాధ్యత, నీపైనే పడిందా!
రెక్కాడితేగాని, డొక్కాడని బతు కులురా నాయనామనవి !!
  కష్టాలే ఐనా...కలత తెలియ ని వయసురా నీది,  అదృష్టవం తుడివి... !
    నాబతుకు కంటే... నీబతుకు నయమే... !
   నీ వయసులో నేను...కడుపు నిండా కూడుకి, నీలాగే ఒంటి నిండా గుడ్డకీ  వాచిపోయిన వాడినే... !
     జట్టుగాలతో ఆటల్లో పడి... 
ఆకలితో సహా అన్నిబాధలూ...
 మరిచిపోయే వాడిని !
  నాతోటిపిల్లలంతా...స్కూళ్లకు
వెళుతుంటే...నేను మాత్రం ఒక పూట గంజికైనా వస్తుందని... 
రోజుకి అరవై పైసలకోసం,ఒక ఫోటో స్టూడియో లో పనికి వెలి పోయేవాడిని...వాళ్ళనిచూసి...ఏడ్చుకుంటూ...! 
  నువ్వద్రుష్ట వంతుడవే... !
 రోజులు మారాయి... !!
   నీకోసం అమ్మ ఒడి ఉంది... 
    హాయిగా చదువుకో... !
 మంచి రేషన్ బియ్యంవస్తున్నా య్...కడుపునిండా నువ్  తినొ చ్చు !
  ఇంటి బరువులు,బాధ్యతలకు
నిరుత్సాహ పడకు..., ఎంత కష్టపడతామో... అంత సుఖ పడతాం...!
   జీవితమంటేనే...కష్ట,సుఖాల
వెలుగునీడలు... !
  నేటి కష్టాలు, రేపటి సుఖాలకే 
   నీకు మంచి జరిగే తీరుతుంది 
         ******

కామెంట్‌లు