పురుషుల దినోత్సవం - మాడుగుల నారాయణ మూర్తి

 మత్తేభము*
పురుషుండెవ్వడొ లోకమెంచగను సంభోగమ్ము సంతానమే
పరమార్థంబని దల్వ దోషమగు:; సద్భావంబుయోచించ:;సం
బరమేముండు కృతార్థుడై బ్రతుకు సాఫల్యమ్ములన్ బొందగన్
చరమాంకమ్మున బాధజెంద నరుడా జన్మమ్ము వ్యర్థమ్మగున్!!
*కందము*
ధర్మార్థ కామ మోక్ష ము
మర్మమ్మును దెలిసికొనిన మన్నన దక్కున్
కర్మల సాధన పురుషుల
శర్మమ్మును బెంచు కీర్తి సహజంబందున్!!
*ఉత్పలమాల*
పుట్టిన జన్మ సార్థకత పుత్రుడుసేవల తల్లిదండ్రులన్
మట్టిని,వృత్తి,విద్యలను మైత్రిని గాచి పరోపకారమున్
చుట్టు సువాసనల్,చెలిమి శోభలతోమగధీరుడైమనునన్!!
*శార్దూలము*
వాగర్థమ్ముల  రీతి భార్యలకు భారము భాగ్యములందుప్రేమతో
కాగలబాధ్యతల్ పనులు కర్తగ నిల్చియు తోడునీడగా
రాగముపంచ గొప్పయగురంజిలునోపురుషుండు శక్తియై
శ్రీ గరిమాభి వృద్ధిగను చేతనమొందుటె వాస్తవమ్మగున్!!
*ఆటవెలది*
మగతనమ్ముతోసమాజముమంచికై
పాటు పడిన యపుడె చోటుయుండు
స్త్రీల పట్ల భక్తి జీవించి సోదర
భావ మున్న పురుషవైభవమ్ము
*తేటగీతి*
జాతి మెచ్చగా తన వారు దరికి దీయు
నీతి నియమాల కర్తవ్యనేస్తమైన
పురుష జన్మము ధన్యమౌ పూర్ణచంద్ర
కాంతి ప్రసరించు నెదలోన శాంతినింపు
కామెంట్‌లు