ముందు చూపు!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు స్లిప్ టెస్ట్ ఉంది అన్న సంగతి పిల్లలు మర్చిపోవటం అశ్రద్ధ చేయటం జరిగింది. "నిన్నంతా ఆదివారం ఏంచేశారు? మీరు రాసితీరాలి"అని అంది.శివా టీచర్ చెప్పేటప్పుడు ముఖ్యమైన పాయింట్లు రఫ్ బుక్ లో రాస్తాడు.శివా ఒక్కడే శభాష్ అనిపించుకున్నాడు.అందరినీ నించోపెట్టి టీచర్ కథ చెప్పసాగింది"హరి నారాయణ ఇద్దరు పొరుగూరు జాతరకి నడుస్తూ పోతున్నారు. ఓమూడుమైళ్ల దూరం కాబట్టి బైలుదేరారు.హరికి చాదస్తం ఎక్కువ. చెప్పులేసుకుని దైవస్మరణ చేయడం తప్పు అని కాలిలో ముల్లు పల్లేరుకాయలు గుచ్చుకుంటున్నా ఆగి వాటిని తీసి బాధ పడుతూ నడుస్తున్నాడు. నారాయణ అన్నాడు "హరీ!నీది మరీ చాదస్తం! మనం పోయేది  అడ్డదారి అని తెలుసు. ముళ్ళు తుప్పల దారిలో చెప్పులులేకుండా నడుస్తున్నావు.దేవుడు భక్తి మనసు చూస్తాడు కానీ కాలిచెప్పులు చూడడు.రక్తం కారుతూ ముల్లు గుచ్చిన బాధతో నడవలేవు.గమ్యం చేరలేము". "నారాయణ!ఈతోవలోని ముళ్ళు తీసి నడుస్తా.జాతరలో చెప్పులు పోతే కష్టం కదా?""చూడు హరీ!ముందు చూపు ఉండాలి. అతి చాదస్తం పనికిరాదు.గుడిదాకా చెప్పులు వేసుకుని వెళ్లవచ్చు కానీ గుడిలోపలికి వెళ్లకూడదు. సరే కాసేపు నాచెప్పులు వేసుకుని నడు" అని తను జాగ్రత్త గా అడుగులేస్తూ నడవసాగాడు.దైవధ్యానం మంచిదే కానీ శరీరం కి కష్టం కలిగిస్తూ స్మరించలేము.పవిత్ర దేవాలయం లాగా శరీరం ని కాపాడుకోవాలి." కథ ముగించిన టీచర్ అడిగింది "దీని వల్ల మీకు ఏంతెలిసింది?" రేపటి బడికి ఈరోజు రాత్రి  అన్నీ పుస్తకాలు పెన్ను సిద్దంగా సంచీలో సర్దుకోవాలి.ఆదివారం బద్దకం వద్దు అని " పిల్లల జవాబు విని  నవ్వుతూ టీచర్ "ఇక కూచోండి" అంది🌹
కామెంట్‌లు