శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 మహాభారతం లో కపటి ధూర్తుడైన శకుని దుర్యోధనుని మేనమామ గాంధారి సోదరుడు.నేటి ఆఫ్ఘనిస్తాన్ ఆనాటి గాంధార రాజ్యం.శకుని అంటే అర్థం గద్ద.ఇతరప్రాణులమాంసాన్ని మరీ లాగి పొడిచి చంపి చంపి తింటుంది.శకుని కూడా పాండవులని మాటలు చేతలతో హింసించాడు కదా!

శాఖామృగం అంటే అందరికీ తెలీదు కానీ కోతి అనగానే ఫక్కున నవ్వుతాం.ఉడుతను కూడా శాఖామృగం అంటారు.కానీ చెట్లకొమ్మలపై ఉంటూ కోతి కొమ్మచ్చి ఆడే కోతికే ఆపదం సరిగ్గా సరిపోతుంది.పక్షులకు వాడరు.
శాకంభరీ అంటే కూరగాయలు తిని జీవనం గడిపేవారు అని అర్ధం.రాజస్థాన్ లోఈపేరుతో పుణ్య క్షేత్రం ఉంది.నవల్గఢ్ కి25మైళ్ళ దూరం లో ఉన్న ఈప్రాంతంలో కూరలు సమృద్ధిగా పండుతాయి.పర్వతప్రాంతంలోశాకంభరీదేవి ఆలయం ఉంది.ఇదిశక్తిపీఠం.
శస్త్ర అంటే అర్థం ఆయుధం.శత్రువుని బాకు కత్తి  బల్లెం తో పొడిచి చంపే ఆయుధం.శత్రువుని సమీపించి అతని శరీరాన్ని కోయటం ఛిద్రం చేయటం చాలా చురుకుగా చాకచక్యంగా దాడి చేయటం సామాన్యం కాదు.🌸

కామెంట్‌లు