*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు" - సమాప్తం*
 *భద్రాచల రామదాసుగా చిరంతరమైన యశస్సును పొందిన కంచెర్ల వంశోద్భవుడు రచించిన "దాశరధీ శతకం" లోని 103 పద్యాలను శ్రీరామచంద్రుని కృపతో ఈ రోజు వరకు చదువుకో గలిగాము.*
*"రామచంద్ర రఘువీరా, రామచంద్ర రణధీర" అని రామనామ వైభవాన్ని, ప్రాభవాన్ని మీతో పాటు నేను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించి, ఆనందాన్ని మనసులో నింపుకో గలిగాను. నామ భజన తప్ప వేరేది కూడా ఈ కలియుగంలో మనకు తోడు రాదని, ఉండదని తెలుసుకో గలిగాము.*
*మీ అందరి ప్రోత్సాహంతో, సహృదయ స్పందనల తోడ్పాటుతో,

ఇప్పటి వరకు 1. సుమతీ శతకము, 2. వేమన శతకము, 3. భాస్కర శతకము, 4. శ్రీ కృష్ణ శతకము, 5. దాశరధీ శతకము, 6. శ్రీ కాళహస్తీశ్వర శతకము, 7.  గువ్వల చెన్న శతకము, 8. భర్తృహరి నీతి శతకము అనే ఎనిమిది శతకాలను నేను చదివి మీకు పంచ గలిగాను.*
*రెండు రోజుల విరామము తరువాత, భగవదనుగ్రహంతో, మరి ఒక శతకముతో మిమ్మల్ని పలుకరించే ప్రయత్నం చేస్తాను. మీ అందరి ఆదరణ, తోడ్పాటు ఇంతకు ముందులాగే ఉంటుంది అని, ఉండాలి అని కోరుకుంటూ...*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు