రాజు విజయసేనుడు ఆనందం గర్వం తో సభనంతా పరికిస్తూ ఉన్నాడు.దానికి కారణం పొరుగు రాజు ని చిత్తుగా ఓడించాడు.సభికులప్రశంసలతో ఉబ్బితబ్బిబ్ఫు అయ్యాడు.గర్వం అహంకారం ఒళ్ళు అంతా పాకుతోంది.రాజకవి వైపు చూస్తూ అడిగాడు "ఏం కవీ అంత నిశబ్దం గా ఉన్నారు?అంతా నన్ను పొగుడుతూ ఉంటే మీరు ప్రశంసగా ఓపద్యం చెప్పండి "."క్షమించండి ప్రభూ! నేను ఆదేవుడిని తప్ప వేరే వారిని ప్రశంసలు పొగడ్తలతో ముంచెత్తను.నాది పోతన మహాకవి మార్గం.అంతా ఆభగవంతుడి లీల."ధన బల గర్వంతో పాటు రాజుననే అహంకారం తో "ఆకనపడని దేవుడివల్ల నీవు నాఆస్థానంలోకి రాలేదు. నేను నీకు కొలువు ఇచ్చాను.ఓవారంలోపల నాపై కావ్యం రాయకపోతే మరణశిక్ష తప్పదు. "కవి నోరెత్తలేదు. మూర్ఖుడైన రాజు తో మాట్లాడిలాభం లేదు. ఆపరమాత్మను తప్ప ఎవరినీ ప్రశంసించను" అని దృఢంగా నిర్ణయం తీసుకున్నాడు. దైవధ్యానం లో గడుపుతున్నాడు.ఎప్పటికైనా చావాల్సిందే మరి!
మూడోరోజు పాముకాటుతో రాకుమారుడు మరణించాడు. ఆర్తనాదాలు హాహాకారాలు చెలరేగాయి.రాజు ఏకైక సంతానం! కవి పరుగులు పెట్టి రాకుమారుడు పడుకున్న చోట కూచుని దైవధ్యానం చేయసాగాడు."కవీ! నిన్ను దైవాన్ని దూషెంచాను.నాకొడుకు ని పోగొట్టుకున్నాను.గర్వం అహంకారం దైవంముందు బలాదూర్! దేవుడే బుద్ధి చెప్పాడు" "నాన్నా!ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నావు సంతోషం. దేవుడే సర్వం !"అని రాకుమారుడు లేచి కూర్చున్నాడు.అంతా దిమ్మెరపోయారు.నిజానికి ఇది రాకుమారుడు ఆడిన నాటకం.కవికి మరణశిక్ష వేసిన తండ్రి కి బుద్ధి చెప్పాలనుకున్నాడు.యోగాభ్యాసంతో శరీరాన్ని నిశ్చలంగా ఉంచి తాను చనిపోయినట్లు నటించాడు.రాజు కి బాగా బుద్ధి వచ్చింది. "కవీ! భగవంతుడిని కీర్తిస్తూ కావ్యం రాయండి " అన్న రాజు మాటలకు అంగీకారంగా తలూపాడు కవి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి