సుడిగాలై చుట్టూ తిరుగుతూ...;-కిలపర్తి దాలినాయుడు
గాలి అలలు తానూ లతను
పులకింపజేస్తాయి!
వేణువును బాధపెట్టి
ఏవో కొన్ని ఏడ్పు రాగాలను
వినిపింపజేస్తాయి!
గడ్డిపూల తలలను ముద్దాడి
గులాబీని కౌగిలించుకొని
విరహజ్వాలలను రెకెతిస్తాయి!
ఆకుల సందులో కాసేపు దూరి
ఆటలాడి కోమ్మలను కదుపుతూ పిట్టలను బెదిరిస్తూ.....
దుమ్మూ,ధూళి మీదను పోసుకొనీ ఎటో పోతాయి!

వీరుని శవం పైనుండి 
వీచిన ఒక వీచిక మాత్రం
త్యాగాలను గానంచేస్తూ
సుడిగాలై చుట్టూ తిరుగుతుంది!
----------------------------------------


కామెంట్‌లు