సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 సురాలించు...సురాళించు
  ******
నిన్ను నీవే కాదు ఇతరులను ఎవరినీ  కూడా సురాలించవద్దు.పెద్దలూ,హితైషులు చెప్పే మంచి మాటలను ఎప్పుడూ సురాలించకూడదు.
సురాలించుట అనేది  గర్వానికి,అహానికి, మూర్ఖత్వానికి చిహ్నం.
సురాలించు అంటే ఏమిటో ఈపాటికి అర్థమై వుంటుంది. మరి అర్థాలను చూద్దాం.... అలక్ష్యం చేయు,అవకర్ణించు,తృణీకరించు, పెడచెవిన పెట్టు, నిర్లక్ష్యము చేయు,సడ్డించు మొదలైన అర్థాలు ఉన్నాయి.

అలాంటి ప్రవృత్తిని వీడి ఆత్మీయంగా ఇతరుల మనసులను మల్లెపూల పరిమళంలా సురాళించాలి.
 మంచిపనులతో మన వ్యక్తిత్వం చుట్టూ ఉన్న సమాజాన్ని ఆవరించాలి. వారి హృదయ సీమను అభివేష్టించాలి.
సురాళించు అంటే ఏమేమి అర్థాలు ఉన్నాయో చూద్దాం...చుట్టుకొను,అభివేష్టించు,అల్లుకొను,ఆవరించు,క్రమ్ముకొను,గిఱికొను,గుండుకొను,పరివేష్టించు,పెనగొను,వేష్టించు,పరిగొను లాంటి అర్థాలతో పాటు దిగదీయు,దిష్టితీయు,నివాళించు,మురాళించు లాంటి నానార్థాలు కూడా ఉన్నాయి.
సురాలించు అనే దుర్గుణానికి దూరంగా ఉందాం.సహృదయతా లతలమై  సురాళించుదాం.
ప్రభాత  కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు