జిల్లా గురుకుల క్రీడామణులు*;-వెంకట్ :మొలక ప్రతినిధి వికారాబాద్
 - వికారాబాద్ లో గురుకుల సొసైటీల విద్యార్థినులకు క్రీడా శిక్షణ
- 12 పాఠశాలలు, 50 మంది క్రీడా విద్యార్థినిలు సమాయత్తం
- ఎన్నేపల్లి సంఘం లక్ష్మీబాయి పాఠశాలలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రీడా శిక్షణ
ఈనెల 9 నుంచి 26 వరకు కొనసాగింపు
: విద్యార్థినిలు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించి క్రీడా ప్రతిభను వెలికితీస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా స్థాయి నుంచి ఎంపికైన క్రీడా విద్యార్థినులకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి సంగం లక్ష్మీబాయి గురుకుల బాలికల పాఠశాల కళాశాల వేదికైంది. ఈనెల 9 నుంచి 26 వరకు శిక్షణ జరుగుతుంది. ఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 తెలంగాణ రాష్ట్ర గురుకులాల సొసైటీ పాఠశాలల నుంచి 50 మంది ఎంపికైన అథ్లెటిక్స్ విద్యార్థినిలు శిక్షణ పొందుతున్నారు.
తాటిపల్లి-1,
మెదక్-6,
బాలానగర్-5,
రామన్నపేట-3,
తాండూర్-3
హసన్పర్తి-6
నిర్మల్-2
బోరబండ-6
బోధన్-1
సిద్దిపేట్-1
వైరా-4
వికారాబాద్-11
విద్యార్థినిలు అథ్లెటిక్స్ రన్నింగ్,
ఐ జంప్,
లాంగ్ జంప్,
చెస్,
షాట్ పుట్,
డిస్కస్ త్రో ల్లో శిక్షణ పొందుతున్నారు.
సంగం లక్ష్మీబాయి పాఠశాలలో ఈ అథ్లెటిక్స్ క్రీడాకారులకు ప్రతిరోజు ఉదయం 5 నుంచి 9:30 వరకు సాయంత్రం నాలుగు నుంచి 6:30 వరకు శిక్షణ కొనసాగుతోంది ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షిస్తున్నారు. అథ్లెటిక్స్ లో తగు సలహా సూచనలు ప్రోత్సాహాన్ని రమణమ్మ అందిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ తో పాటు జనరల్ సొసైటీ విద్యార్థినులకు జరుగుతుంటాయి.
ఈ సంవత్సరం 28న భద్రాచలంలో జరిగే అన్ని సొసైటీల గురుకులాల అథ్లెటిక్స్ పోటీలు జరుగనున్నాయి.
జాతీయస్థాయికి రుక్మిణి
 కాగా వికారాబాద్ జిల్లా నుంచి ఖో ఖోలో సంఘం లక్ష్మి భాయి గురుకుల కళాశాల నుంచి ఎంపీసీ మొదటి సంవత్సరానికి చెందిన విద్యార్థిని రుక్మిణి జాతీయ స్థాయికి ఎంపికై పోటీలకు వెళ్లింది. కరీంనగర్ లో జరిగే జాతీయస్థాయి ఖో ఖో పోటీల్లో వికారాబాద్ సంగం లక్ష్మీబాయి కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని రుక్మిణి ఎంపికై శిక్షణకు వెళ్లారు.
అలాగే కబడ్డీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరానికి చెందిన నవ్య జాతీయ స్థాయికి ఎంపికై శిక్షణ పొందుతున్నారు.

కామెంట్‌లు