చదువులబాబుకు బాలబంధు సమతారావు పురస్కారం
  తెలుగు భాషోపాధ్యాయుడు,రచయిత డి.కె. చదువుల బాబు కు బాలబంధు సమతారావు పురస్కారాన్ని తెనాలిలో గ్రంథాలయాధికారిణి కావూరి రమాదేవి, ఆలపాటి కళావతి రవీంద్రపీఠం అధ్యక్షులు డా.అయినాల మల్లేశ్వరరావు 

ఆదివారం  ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలోని కవిరాజు త్రిపురనేని సభాభవనంలో 55వ జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల సభలో ప్రదానంచేశారు. బాల సాహిత్య రంగంలో వీరు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. చదువులబాబు మట్లాడుతూ ఈ పురస్కారంతో రచయితగా తన బాధ్యత మరింత పెరిగిందని అభిప్రాయపడ్డారు.ఈకార్యక్రమంలోడా.అయినాల మల్లేశ్వరరావు,కావూరి రమాదేవి,షేక్ అబ్దుల్ హఖీంజానీ, విష్ణుమొలకల భీమేశ్వర ప్రసాదు, ఆచార్యకృపాచారి, ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం సభ్యులు పావులూరి శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
9440703716
కామెంట్‌లు