"ఏంట్రా రవీ...పొద్దుటినుండి
అలా అద్ధం దగ్గరే అతుక్కు పోయావు?"
"నేను ఎదుగుతున్నాగా మమ్మీ."
"అయితే అద్దం దగ్గరేం పనిరా? "
"చిన్న ప్రాబ్లెమ్ వచ్చింది మమ్మీ."
'నీకొచ్చిన కష్టం ఏంటో త్వరగా చెప్పు. మళ్ళీ మీ నాన్న వస్తే నాకు క్లాస్ పీకుతారు.
"నీ వయసులో మీ అక్కఇలాగే మొటిమలు వస్తున్నాయని తెగ బాధ పడేది. ఇలాగే అద్దం ముందే కూర్చునేది. దాన్ని ఎలా దాయాలా అని తలబద్దలు కొట్టుకునేది."
"నాకు రావట్లేదని బాధగా వుంది మమ్మీ. "
"మొటిమలు రావట్లేదని బెంగా?"
"కాదుమమ్మీ నాకుమీసాలు రావట్లేదని బెంగ."
"సరిపోయుంది అక్కకు తగ్గా తమ్ముడివి. ఏదో చిన్న ప్రాబ్లెమ్ తీసుకుని తీరుబాటుగా భలే బాధపడతారు."
"నన్ను అందరూ ఇంటర్అయిపో
యినా గడ్డాలు, మీసాలురావట్లేద
ని తెగఏడిపి స్తున్నారు."
వస్తున్న నవ్వు ఆపుకుంటున్న తల్లిని చూసి వుడుక్కున్నాడు.
**
"మర్నాడు ఏంట్రా రవీ నీకేదో ప్రాబ్లెంట కదా. డాక్టర్ అక్కని ఇంట్లో పెట్టుకుని నువ్వెందుకురా బాధపడతావు. కమాన్ చెప్పు సాల్వ్ చేసేస్తాను."
"ఏదోలే నీకు చెప్పను ఫో."
"అదేంరా?"
"అదంతేనే అందరూ నన్నేడిపి
స్తున్నారు."
"అమ్మ బాధపడిపోతోంది రోయ్.
అదేదో చెప్పారా?పోనీ నాన్నని పంపనా?"
"వద్దులే, నువ్వే నయం. "
"నాకు మీసాలు రావట్లేదని.."
"అయితే ఏముంది కొంతమందికి త్వరగా వస్తాయిలేరా."
"అందరూ ఏడిపిస్తున్నారే."
"వాళ్ళమొహంలే ఇవన్నీ సీరియస్గా తీసుకోకు."
"మరీ.. ఆ రమ్య కూడా నన్ను చూసి నవ్వింది."
"ఎప్పటినుండిరా అందర్నీపట్టించు
కుంటున్నావు."
"నేను రమ్యకి ప్రపోజ్ చేసాను."
"ఆ... ఏంటి ప్రపోజా? అంటే అర్ధం తెలుసా?"
"ఆ రమ్య మా కాలేజ్ బ్యూటీ కదా
అదేమో మీసాలన్నా రాలేదు. అప్పుడే నీకు కంగారేంటి పోరా అంది."
"ఓహో, మాబాగా అయ్యింది. "
"నీకు వేళాకోళంగా వుందా పోనీలే
అక్కవని చెబితే"
"మరి అప్పుడే ప్రపోజ్ చెయ్యడా
లేంటిరా.యూ సిల్లీ స్టుపిడ్."
"మరి కాలేజ్ వదిలి వెళ్ళిపోతాము కదా. లవ్ అంటే టీన్ఏజ్ లోనే పుడుతుందిట. మళ్ళీ కుదరదని చెప్పేసాను."
"నీకు ఇవన్నీ ఎవర్రా చెపుతు
న్నారు. వీటికి చాలా టైం వుంది. ముందు బాగా చదువుకో, జాబ్ తెచ్చుకో, సెటిల్ కావచ్చు. ఇది లవ్ టైం కాదు నాన్నా, స్టడీ టైం, ఇంపార్టెంట్ టైం,వేస్ట్ చేసుకోకు. వీటికి ముందు, ముందు లైఫ్ అంతా ఉందిలే."
"అంతేనా ఈవయసులో చదువుకోవాలా?
"మరేం చేద్దాం అనుకున్నావు?
ఇప్పుడు అర్జెంట్గా ప్రేమించి, పెళ్లిచేసుకుని, పిల్లల్ని కని, కూలీ పని చేసుకుంటూ బ్రతుకుతావా?"
"కూలీ పని ఏంటి? "
"మరి నీ ఇంటర్ చదువుకి ఏం ఉద్యోగం వస్తుందనుకున్నావ్?
నిన్నూ, రమ్యనూ నాన్నే కూచో
పెట్టి పోషిస్తాడు అనుకున్నావా?"
"నాన్నకి తెలిస్తే చీరేస్తాడు.ఆయన లక్షలు పోసి చదివిస్తారు. కానీ వెధవ్వేషాలిస్తే సీను మారిపోద్ది.
అటు రమ్య తల్లి తండ్రులూ ఊరుకోరు."
"మేజర్లు కాకుండా పెళ్ళిచేసుకుం
టే పోలీస్ కేసు అవుద్ది బుజ్జి."
సినిమాలు చూసిదారి తప్పితే జీవితాలు నాశనం అవుతాయి. "
"కదా అక్కాఇవన్నీ ఆలోచించలేదే నేను చదువుకుని సెటిలవుతాను. నాకు ఇవన్నీ వివరంగా చెప్పినం
దుకు థాంక్స్. మా అక్కబంగారం."
***
**
టీనేజ్ ;-చంద్రకళ యలమర్తి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి