శబ్ద సంస్కృతి!అచ్యుతుని రాజ్యశ్రీ

 గంధర్వ అతి ప్రాచీన జాతి."గంధం సంగీత వాద్యాది జనిత ప్రమోదం అర్వతి ప్రాప్నోతి ఇతి"అని దీని వ్యుత్పత్తి అర్ధం. సంగీత కళాకారుల ప్రతిభను గంధర్వ గానంతో పోలుస్తారు. సంగీతాచార్యుడనే అర్ధం కూడా ఉంది హిందీ లో. ఋగ్వేదంలో గంధర్వ ప్రస్తావన ఉంది. యజుర్వేదంలో27 అధర్వవేదంలో 6333 గంధర్వులు అని పేర్కొనబడింది.కశ్యప అదితులకి  ఉదయించినవారట! దేవతల లో వీరు మూడోశ్రేణికి చెందిన వారు. మహాభారతం లో చిత్ర రధుడు గంధర్వ పతి.ఇంద్రసభలో గాన వాద్య సంగీతం వినిపించటమే వీరి పని.చాక్షుషీ సమ్మోహన విద్య లు కూడా వీరికి తెలుసు. స్త్రీ ల ను అప్సరసలు అంటారు. నేడు వారణాసి  అల్హాబాద్ గాజీపుర్ రాజస్థాన్ లో కొన్ని తెగలవారు తాము గంధర్వులమని చెప్పుకుంటారు.వీరి వృత్తి ఆటపాట వాద్యసంగీతం వినిపించడం!
గాంధీ  గంధీ వృత్తి కి సంబంధించిన పదం.రాజస్థాన్ లో వైశ్యులుగా గుజరాత్ లో గ్రంధప్ గా పిల్వబడుతున్నారు.గాంధీ అంటే సుగంధ ద్రవ్యాలుఅమ్మే  వణికులు.గంధవేణే అని కూడా పిలుస్తారు. "గంధిక కల్పవల్లి"అనే పుస్తకంలో వీరి ఉత్పత్తి ని గూర్చి ఓకథ ఉంది. శివుడు ధ్యాస మగ్నుడై ఉండగా లలాటం నించి దేశ్ వాస్  వక్షంనించి శంఖభూతి ఇంకా శరీర ఇతరభాగాలనించి  వేర్వేరు జాతులు  గంధవణిక్ జనించారు.ఇంకో వాదం ప్రకారం తాంబూలవణిక్  పాన్ వణిక్ శివుని స్వేదం నించి పుట్టారు.వీరు మొదట శైవులు.క్రమేణా శాక్తులైనారు.గాంధీ అని గుజరాతీ పంజాబీ బెంగాలీ లో 
గంధే అని  మరాఠీలో పిల్వబడుతున్నారు. సుగంధ తైలం అత్తరు తయారు చేసి అమ్మేవారిని అత్తార్ అని కూడా పిలుస్తారు 🌷
కామెంట్‌లు