ఆఅదృష్టం,యేకొందరికోకదా.!";- కోరాడ నరసింహా రావు.
తల్లికడుపున పడ్డది మొదలు 
 పడ్డ యాతన చాలలేదని...
నోటిలో నోరు పెట్టి ఊదో... 
గుండెలమీద గుభీ - గుభీ మని 
గుద్దో... ఆక్సిజెన్ పెట్టో... సెలీన్ ల తోనో...ఉండలేక... పోతున్న ప్రాణాల్ని బలవంతంగా... పట్టి ఉంచటం !  
 
  అనుభవించవలసిన శేషం.... 
 ఇంకా మిగిలిపోయిందని
     ..... కాబోలు... !!
తెలిసి కొంతకాలం... 
  తెలియక కొంతకాలం..., 
 సుఖదుఃఖాల ఒరిపిడిలో... 
. నలిగి... శక్తంతా సన్నగిల్లి... 
జీవచ్చవమైపోయినా....
 కర్మఫలాన్ని నిస్సేశంగా అనుభ వించేస్తే  తప్ప ముక్తి కలుగదన్న   ది రుజువుచేస్తున్నట్టుందీ జీవి !
  
సునాయాస మరణం  కాదు.., 
అనాయాసమరణాన్ని పొంద టం, ఎంత మహద్భాగ్యం.. !
 
 ఆ అదృష్టం యే కొందరికో  కదా... !!
     *******

కామెంట్‌లు