* కోరాడ నానీలు *

 ఏ  ఎండకు,  ఆ గొడుగు 
  పట్టగలడు ... !
  అందుకే వాడు... 
  అజాతశత్రువు  !!
    *******
విచ్చకాలతోనే... 
  అందరి మెచ్చుకోలూ.... !
   యదార్ధానికి... 
    అందరూ ముఖంచాటే !!
..  *******
 మంచి విద్వత్తువున్నా.. 
  రాణించలేదెందుకో.... ?
    వాడిలో.... లౌక్యం లేదు 
       అందుకే.... !
..    *******
బుద్ధి వద్దంది... 
  మనసు  వినలేదు !
   .. శిక్షను ... 
    శరీరం అనుభవిస్తోంది   !!
      ******
ఆత్మవంచనది ... 
   కృతాకానందం... !
     నిజాయతీది బాధైనా 
       అదే నిజానందం !!
      ******
...కోరాడ నరసింహా రావు !
కామెంట్‌లు