సంత (సమ్మోహనాలు )-ఎం. వి. ఉమాదేవి
ధరలు చెట్టెక్కాయి 
చెట్టెక్కి పిలిచాయి 
పిలిచినా అటువెళ్లి కొనలేము ఓ వనజ 

వంకాయ నోరూరు 
నోరూర ధర పోరు 
పోరుగా ప్రతికూర ప్రియమయ్యె ఓ వనజ !

టమాటా కొనలేము 
కొనగాను తినలేము 
తినకున్న రైతులకి నష్టమే ఓ వనజ !

కాకరకె షుగరయ్యె 
షుగరుతో సగమయ్యె 
సగమయ్యి తూకాలు సరిపెట్టు ఓ వనజ !

క్యాబేజి అలిగింది 
అలిగి మరి తొలిగింది 
తొలిగినవి బీనీసు  క్యారెట్లు ఓ వనజ !!


కామెంట్‌లు