తెలివితేటలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇది ఉత్తరాఖండ్ కి సంబంధించిన జానపదకథ.ఆటవికులు నివసించే ఆప్రాంతంలో ఓతెగనాయకుడి కుమార్తెను ఓపెద్దపులి దుప్పి చూశాయి.ఆమెను పెళ్లాడాలని పోటీ పడ్డాయి.తమ కులదేవతలు ఇలా జంతురూపంలో సంచరిస్తారని ఆటవికుల నమ్మకం! మన కథల్లోగూడా దేవతావాహనాలు జంతువులే కదా? మునులు యోగులు ఇలా పశురూపంలో ఇప్పటికీ తిరుగుతుంటారని హిమాలయాల సానువుల్లో సంచరిస్తారు అని చెప్తారు. ఐతే ఈపిల్ల చాలా తెలివిగలది.నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా వాటితో ఇలాఅంది" ఏయ్ పులీ! నీగోళ్లు నోటి దంతాలు చూస్తే నాకు చాలా భయంగా ఉంది. వాటిని శుభ్రం గా  మొదలంటా తీసేసి స్నానం చేసిరా!"అని దాన్ని పంపేసింది. ఆతరువాత వచ్చిన  దుప్పితో "నీ పొడవాటి కొమ్ములు నాశరీరానికి గుచ్చుకుంటాయి.వాటిని సమూలంగా తొలగించుకుని రా!" అంతే! ఆమెచెప్పినట్లు ముందు పులి వచ్చింది. దాన్ని తనతోటివారితో కలిసి బడితె తో చావబాది చంపేసింది.దుప్పికి కూడా  కర్రతో కొట్టి ప్రాణాలతో వదిలేసింది. మనం శత్రువు బలంని అంచనావేసి తగిన శాస్తి చేయాలి. నోటితో  మాట్లాడరాదు.మన మాటలు అందరికీ వినపడ్తాయి కానీ నిశబ్దం గా మనకు గోతులు తవ్వే వారి గురించి మనకు తెలీదు కదా? బడిలో కూడా  అల్లరి పిల్లలతో ఘర్షణ పడితే  మనకే నష్టం! వాడిభయంతో పిల్లలు అంతా అల్లరి పిల్లల కే సపోర్ట్ చేసి తప్పు మనమీద నెడ్తారు.మనం అల్లరి పిల్లలకి దూరం గా కూచోవాలి.టీచర్ హెచ్. ఎం.కి ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పితే సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే అంటారు "మొండివాడు  రాజుకన్నా బలవంతుడు "అని 🌷
కామెంట్‌లు