ఆటంకం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం చేసేపని ఇతరులకు ఆటంకం కారాదు.ఇంకోరికి ఇబ్బంది కలిగించే పని చేయకూడదు. శివా కి అన్ని విషయాలు తెలుసుకోవాలని చాలా కుతూహలం. సైన్సు టీచర్ చెప్పినవి తను స్వయంగా చేసి చూస్తాడు.క్లాస్ లో తన సందేహం తీరేదాకా ప్రశ్నలు గుప్పిస్తాడు."పాఠం ఐపోయాక నీకు చెప్తాను."అని టీచర్ చెప్పింది.మరి సిలబస్ ముగించాలి కదా! ఆరోజు సైన్స్ ప్రయోగాలు పుస్తకాలు చదివి నాన్న చేత భూతద్దం కొనిపించుకున్నాడు.బడికి తీసుకుని వచ్చాడు.షార్ట్ ఇంటర్వెల్ లో ఎండలో భూతద్దం కింద  కాగితాన్ని పెట్టాడు.కాసేపటికి ఆకాగితం భగభగ మండి కాలి బూడిదైంది.ఇంకేముంది!పిల్లలు గుమికూడారు. ఇలా రెండు రోజులు సాగింది. సైన్సు సార్  అది చూసి ఆగుంపు దగ్గరికి వచ్చి "శివా!నీ అభిరుచి  
మెచ్చుకోతగినదే! కానీ  ఓవిషయం గుర్తు పెట్టుకో!షార్ట్ ఇంటర్వెల్ లో  ఇలాచేస్తే అందరూ నిన్ను  అనుసరిస్తారు.బడి క్రమశిక్షణ కు భంగం కలుగుతుంది.నిన్న కబుర్లు చెప్తూ  రోడ్ పై గుంటలో పడి దెబ్బలు తగిలించుకున్నావా లేదా?పెద్దల సమక్షంలో చేయాలి.నిప్పుతో చెలగాటం తప్పు! "అని  ఆభూతద్దం ని తీసుకుని "సాయం త్రం  ఇంటికి వెళ్లేప్పుడు అడుగు ఇస్తాను". అనటంతో తలూపాడు శివా! పిల్లలు అంతా తమక్లాసుల్లోకి దౌడు తీశారు🌹
కామెంట్‌లు