ప్రేమాభిమానాలు...
అన్నిరకాల ఆనందాలు...
. డబ్బుతోనే....
కొనుక్కుంటున్నారు !
******
పిక్నిక్ ... సినిమా....
జూలు .... బీచ్ లు ...
ఆనందాలన్నీ...
ఆర్ధికబలముంటేనే... !
. ******
పోతున్న ప్రాణాలు...
నిలబెడుతుంది... !
నిలువునా ప్రాణాలు...
తీయిస్తోంది... డబ్బు !!
*******
చాలా డబ్బు ను
సంపాదించాడు... !
ఆ డబ్బుకు సార్ధకతేది ?
దానమా - ధర్మమా !!
*****
కేవలం డబ్బే కాదు
మంచి పేరుంది... !
సంపాదించినది...
సద్వినియోగించాడు !!
******
కోరాడ నరసింహా రావు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి