పాపాయి - రూపాయి ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పరుసులోని రూపాయొక పాపాయి
మనసులోని పాపాయొక రూపాయి
నా మనసు
రూపాయి పాపాయిగా
విడిపోయింది
రూపాయిని, పాపాయిని
మనకళ్ళు మనవి కానివిగా 
మనసుకు బుద్ధొచ్చేలా 
వేరుచేసింది
నిదురే లేని రూపాయికి 
పరుసు ఒడిలో నిదుర
పాలబువ్వ అమ్మఒడి
మనసునిండా నిదుర
సంబరమో! సమరమో!
పాపాయి వెన్నెలలా
రూపాయి కన్నులలా
లేమి కలిమి కావడి కుండలు 
పాపాయి,రూపాయి
మత్తు జాతరలు !!

కామెంట్‌లు