జన్మ భూమి;-సుమ కైకాల
ఓ వందనీయ భారతీ !
హిమవన్నగమే నీ దరహాసం 
హిందూ సంద్రమే నీ చరణ విలాసం 
మహా వేద సృష్టికర్తలు, శాస్త్రజ్ఞులు 
ఉద్భవించెను నీ వడిలో ... 

జీవనదులతో సిరులొలికించే 
భారత ధాత్రీ అభివందనం !
దేశ దేశములకు ఆదర్శంగా 
నిలిచిన భారతీ నీకు వందనం !

నా మాతృభూమి ఇది యని 
ఎలుగెత్తి పాడుకొనుదుమమ్మా 
భరత భూమిలో పుట్టడమే
ధన్యము...ధన్యము తల్లీ !!!

కామెంట్‌లు