సునంద భాషితం ;వురిమళ్ల సునంద, ఖమ్మం
 చితము... జితము
   *****
మనం చేసే మంచి పనులు చితము కావాలంటే చేసే వాటిల్లో నీతి, నిజాయితీ, నమ్మకం కనబడాలి. సమాజ హితమైనవో , జీవనోపాధిని కలిగించేవో సాహిత్యానికి సంబంధించిన సేవో ప్రతిఫలాపేక్ష లేకుండా ఉంటే చాలు.వాటంతట అవే చితము అవుతాయి.
ఇంతకూ చితము అంటే ఏమిటో చూద్దాం... చితము అంటే వ్యాప్తి,అనఘళము,చలామణి,వితతి, ప్రచారము, ప్రాచుర్యము, విస్తరణము,వ్యాపనము ప్రాచుర్యము వితతము,వ్యాపనము,ప్రచురత్వము మొదలైన అర్థాలు ఉన్నాయి.
 కొందరు వ్యక్తులు  చితము కోసం ప్రాకులాడుతూ ఉంటారు కానీ  వారు చేసే పనుల్లో జితము ఉండదు.
కొందరు ఏ చిన్న ఒడుదుడుకులు, అవరోధాలు ఎదురైనా స్థైర్యాన్ని కోల్పోతారు. శాశ్వతంగా గుర్తింపు తెచ్చే వాటిని సైతం వదిలేస్తూ ఉంటారు.
అలా కాకుండా  ఎంతో ప్రతిష్టాత్మకంగా,ఓ మంచి ఉద్దేశ్యంతో చేసే సార్వకాలికమైన పనుల్లో కుదురు వుండాలి.
ఇంతకూ జితము అంటే ఏమిటో అర్థమై వుంటుంది.జితము అంటే స్థిరము,అకుంఠము,అక్షయము,ఖాయము, కుదురు,అచ్యుతము, శాశ్వతము,నిచ్చలము,సార్వకాలికము, స్థైర్యము,తిరము లాంటి  అర్థాలు ఉన్నాయి.
గొప్ప ఆశయ సాధనలో జితము ఉంటే, అదే మనకు తెలియకుండానే చితము అవుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు