రాయడంలో ఓ తృప్తి
ఉంటూనే ఉంటోంది
ఉంటుంది కూడా
బాధో
దుఃఖమో
సంతోషమో
ఏదంటే అది
కుమ్మరించొచ్చు
రాతకోతలతో....
ఏదైనాసరే
ఎవరినైనాసరే
నేరుగా కనిపించినప్పుడు
చెప్పలేనివి
రాతలతో చెప్పేయొచ్చు
ఎవరిని ఉద్దేశించి
ఈ మాటలంటున్నానో
చదువుతున్నోళ్ళు
ఆలోచనలో పడొచ్చు
అయోమయంలో పడిపోయేంతగా
రాసేయొచ్చు
ఇందువల్ల ఏం లభిస్తుందని
ప్రశ్నించుకుంటే
ఏమీ లేదనే అంటుంది మనసు
ఎవరికీ
కీడు
అపవాదు
కలిగించని
ఈ రాతల వల్ల
ఓ అల్ప సంతోషం మాత్రమే
ఎందుకంటే
రాయడంలో ఓ తృప్తి ఉంటోంది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి