గజల్; లత శ్రీ
శిశిరంలో నిశి రాజులా
 నవ్వుతుంది నా మనసే/
ఇంద్ర చాప వర్ణాలను 
చూపుతుంది నా మనసే//

పోదోటన పరిమళాలు
 నా కవనపు కుసుమాలూ/
తేనీయల తీపి తోటి
 జోగుతుంది నా మనసే//

ప్రతి మదినీ చిరు చినుకుల 
సవ్వడితో ముద్దాడును/
జలపాతపు హోరులుగా 
మోగుతుంది నా మనసే//

తూనీగల ఝుంకారం
 నా అభిమత ప్రకంపనలు/
మయూరమై పరవశించి 
ఆడుతుంది నా మనసే//

 సాహిత్యపు గగనంలో
 కలియ తిరుగు విహంగాలు/
 కూనలమ్మ రాగాలే
 పాడుతుంది నా మనసే//

కామెంట్‌లు
Unknown చెప్పారు…
Chaala బాగుంది మేడం ..