ఎవరై తేనేం @--కోరాడ నరసింహా రావు !
   పట్టణాలు... అవీ కొన్నే... 
 ఇంద్రభవనాలు,దేవలోకాలు !
మానవ జీవన వికాసానికి... 
 మూలాలైన పల్లెల గతిని.. 
 పట్టించుకునే నాధులేకరువు!!

అత్యాధునిక మారణాయుధా లను సమకూర్చుకుంటున్నాం సరే... !
         అంతరిక్ష ప్రయోగాలకు...
అత్యధికమొత్తం ఖర్చుపెడుతు న్నాం... మంచిదే... !
    టెక్నాలజీకినిధులుకేటాయి
స్తున్నాం...హర్షణీయమే... !
    
      నేలవిడిచి సాములెన్ని చేస్తే   మాత్రం...సాధారణ జనజీవనా న్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా !?
    
          అన్ని గ్రామాలూ ... 
ఎన్నో పురములు, చిరు పట్టణ ములు...నడవలేని రోడ్లతో...,
నరక ప్రాయాలు !

ఎండలకు, తాగునీరు దొరకక...
వానలకుజలదిగ్బంధంలోకూరు కు పోయి..., పడరానిపాట్లు !
     
     స్వాతంత్య్రం వచ్చి డెబ్బది ఐదేళ్లు పూర్తయినా...నరకాన్ని అనుభవించటం... !
 
 పాలకులెవరన్నది కాదు... 
ప్రజా జీవనం ఎలా ఉందన్నదే ముఖ్యం... !
పాలించేప్రభుత్వాలెవరివైతేనేం
 సామాన్య ప్రజలను పట్టించుకో నపుడు ... !!
       *******

కామెంట్‌లు