పాట
******
అక్షరాలు దిద్దించిన
ఆదిగురువుకూ
దక్షిణలే యొసగుట నా భాగ్యమెకాదా!
గురు దక్షిణలే యొసగుట
నా భాగ్యమెకాదా
పలకపైన చేయిపట్టి దిద్దించినగురువులు గాన
మనోఫలకమందు దేవునిగా నిలచిపోతిరి
నా మనో ఫలకమందు
గురుదేవునిగా నిలచిపోతిరి ॥॥
దిద్దించిన అక్షరాలు
లక్షింతలుగా
మీ దీవనలై బ్రతుకు తెరవు చూపించెనుగా
సమాజమున మనిషిగాను
నిలబెట్టెనుగా సమాజహితునిగ నను నిలబెట్టెనుగా ॥॥॥॥

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి