కుంగుబాటు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రతిమనిషి లో లోటుపాట్లు శారీరక లోపాలు ఉండవచ్చు. కొందరు భౌతికంగా ఏలోపాలు లేకున్నా  తమలో తాము కుంగిపోతూ ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ తో బాధ పడుతూ ఇతరులతో కలవరు.ముఖ్యంగా విద్యార్థులకు ఈగుణం ఉంటే రాణించలేరు.టీచర్ తోటి పిల్లలు ఏదైనా జోక్స్ వేసినా నవ్వకుండా మూతి బిడాయించుకుని కూచుంటారు.జయ అలాంటి బాపతే! లంగాఓణీ వాలుజడతో కాలేజీకి  వెళ్తుంది.
'రోజూ ఇలా ఎందుకు వస్తావు?మాలాగా మోడ్రన్ దుస్తులు ధరించి రావచ్చు కదా,?అమ్మమ్మ లాగా తయారవకు" అని తోటి ఆడపిల్లలు అంటే మనసులో బాధపడేది.అమ్మా నాన్నలేని పిల్లని అమ్మమ్మ తాత పెంచుతున్నారు. క్లాస్ ఫస్ట్ వ్యాసరచన లో ఫస్ట్ కానీ డిబేట్ అంటే ఆమడదూరం పరుగెడుతుంది.ఆరోజు  సైకాలజిస్ట్ మామయ్య  ఇంటికి వచ్చాడు. "చూడు జయా!నీలో నీవే కుంగిపోతూ ఎవరు నీపై జోక్స్ వేసినా  సీరియస్ గా ఉండకూడదు. కట్టుబొట్టు గురించి ఎవరైనా కామెంట్ చేస్తే నాకు ఇలాగే ఇష్టం  అని చెప్పు.వారు నీమీద జోక్స్ వేస్తే సరదాగా వారితో నవ్వు. నీవూ వారి ని  గమ్మత్తుగా ఏడిపించు.లేదా గట్టిగా వార్నింగ్ ఇవ్వు.అసలు నలుగురితో కలిస్తేనే వారు మనని అభిమానిస్తారు. గాత్రం పాడటం భయమైతే వీణ లేదా వైలెన్ నేర్చుకో ."అంతే  ఇప్పుడు జయ వీణ రేడియోలో యువవాణి లో వాయిస్తోంది. ఆమె లో కుంగుబాటు ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ పోయాయి. 🌷
కామెంట్‌లు