నాలుగు కోట్ల నక్షత్రాలు
చీకట్లో చిక్కుకున్నాయి
ఒక్క నక్షత్రం
లక్ష్యం కోసం దీక్ష
తెలంగాణ పొద్దు పొడిచింది
ఆ నక్షత్రమే సూర్యుడు!!?"
ఏనుగు ఒంటే ఎంత పెద్దదైన
పులి సింహం చిరుత
చరిత్ర సృష్టించిన
యుద్ధంలో పరిగెత్తి గెలిచేది
అశ్వం ఒకటే!!!
ఆ ఆత్మవిశ్వాసమే
తెలంగాణ ఆత్మగౌరవ దీక్ష!!!
అర్ధనారీశ్వరుడు
శివుడొక్కడే!!
కానీ సీతాకోకచిలుక కూడా
సాధించి శోధించి
అర్ధనారీశ్వరుడయింది!!!
ఆంధ్ర తెలంగాణ
విడిపోయింది!!?
మట్టి వాగ్దానం చేస్తే
చెట్టు మొలవకుండా ఉంటుందా!!?
మట్టి వాగ్దానం చేస్తే
కుండా కుండలో అన్నం
కుతకుతా ఉడుకకుండా ఉంటుందా!
అందుకే
తెలంగాణ వడ్డించిన
విస్తరి అయింది ఈరోజు!!?
పంచభూతాలను దిక్కరించి
నిర్మించిన త్రిశంకు స్వర్గం కోసం
పంచభూతాలను తిరస్కరించిన
విశ్వామిత్రుడు అతడు!!!
బౌద్ధ వృక్షం కింద
బుద్ధుడే అతడు
కానీ అక్కడ పుట్టింది
ఒక మహా యోధుడు!!?
జన్మలు లేకుండా
ముక్తి కోసం జన్మించిన
సాధువు కాదు అతను!!
తెలంగాణ విముక్తి కోసం
పునర్జన్మించిన దేశభక్తుడు అతను!!
పార్వతీ దయతో
పరమేశ్వరుని బిక్ష తో పుట్టిన
వినాయకుడు కాదు అతడు
లోకనాయకుడు అతడు!!?
తన గుండెను
తెలంగాణ జెండా చేసి
ఎగిరేసిన
ప్రజాపక్షి అతను!!!
తెలంగాణ దీక్షా దివసును పురస్కరించుకొని
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి