* కోరాడ మినీలు *
  అమృతమే విషమైతే 
         *****
ప్రమాదాలు నివారించటానికి వేసిన స్పీడు బ్రేకర్లు.... 
  ప్రమాదాలు తెస్తున్నై... !
  ప్రాణాలను కాపాడటానికి... 
 తీసుకున్నమందే.... 
   ప్రాణాలు  తీసినట్టు.... !!
   *******
     * ఉత్తమ నటులు *
         *****
వాళ్లంతా  మహానటులు.. 
  గొప్పనటులే.... 
వాళ్ళు నటిస్తే...పాత్రలకంటే 
 ముందు,ఆనటులు కనిపిస్తారు 
 వీళ్లూ ఉత్తమనటులు.. !
వీళ్ళు నటిస్తే... మనకు 
 వీళ్ళు కనిపించరు... 
  ఆ పాత్రలే  కనిపిస్తాయి... !!
      *****
        @ విరామం @
             ***
దేనికైనా... విరామం లేకపోతే 
  విసుగు పుట్టదూ.... !
అది  పనైనా... జీవితమైనా 
 అందుకే ఆ దేవుడు 
జన్మకీ -  జన్మకీ  మధ్య... 
 మరణాన్ని విరామంగాపెట్టాడు
       ******

కామెంట్‌లు