సునంద భాషితం ; వురిమళ్ల సునంద ఖమ్మం
 దిటము...దిట్టమ
   *****
మనిషిలోనే కాకుండా మనసులో కూడా దిటము ఉండాలి. మనసు దిటముగా ఉన్న వ్యక్తి   సమస్యల సాధనలో ముందుంటాడు.
"సింహం -కుందేలు కథ"లో  శారీరక దిటము కంటే బుద్ధి దిటము వల్ల ఎలా ఆపద నుంచి తప్పించుకుందో  మనం పంచతంత్ర కథల్లో చదువుకున్నాం.
 దీనిని బట్టి శారీరక దిటము అంతగా లేకున్నా మానసిక దిటము ఉంటే ఏదైనా సాధ్యమే అనే విషయం తెలిసిపోతోంది.
అసలు దిటము అంటే ఏయే అర్థాలు ఉన్నాయో చూద్దాం.
దిటము అంటే బలము,అంజస్సు,దండితము,దార్డ్యము,విక్రమము,సత్తువ,సత్త్వము లాంటి అర్థాలతో పాటు దండితనము,పేర్మి,అతిశయము,బలిమి,బింకము,బిట్టు,బెట్టు,ఔఘళము,అతివేలము,ఉదంచితము లాంటి అర్థాలు ఉన్నాయి.
దిటము ఉంటే  మానసిక స్థితి కూడా దిట్టంగా  ఉంటుంది.
ఏ పని చేయడానికైనా లేదా చేయకుండా ఉండటానికైనా  మనసు తీసుకునే గట్టి నిర్ణయమే దిట్టము. మంచి చెడులను బేరీజు వేసుకుని ఏది సరైనది ఏది కాదు అనేది ఖచ్చితంగా చేయగల క్రియనే దిట్టము అంటారు.
 దిట్టము అంటే ఏమిటో చూద్దాం .‌.. నిశ్చయము,అనుభావము, ఖరారు,అవధారము, నిర్ణయము,వ్యవసితము,ధ్రువము,నిచ్ఛలము, స్థితి లాంటి అర్థాలు ఉన్నాయి.
మనసు శరీరాలను దిటముగా  ఉంచుకోవాలి.చేసే పనుల్లో దిట్టము ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు