మరణిస్తోంది @-- కోరాడ నరసింహా రావు
సుహృద్భావ, సహజీవనంతో 
విలసిల్లిన మంచితనం.... 
క్రుంగి, కృశించి నశిస్తోంది.. !

తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవా లనుకునే ఆరాటం, ఎంతగా... 
పోరాడుతున్నా.., 
  అన్నిచోట్లా అపజయాన్నే... 
   చవిచూస్తోంది... !

అనేకానేకంగా విభజనకు గురై..
పూర్తిగాతనఉనికినికోల్పోతోంది 
మన కులం... మన మతం... 
 మన వర్గం అంటూ మెస్మరైజ్ 
చెయ్యబడ్డ మనసు..మనిషి తనాన్ని నిర్బంధిస్తూ నియంత్రి స్తోంది.... !

 మనిషితనం.,కాలుకదపలేక 
నోరు మెదపలేక...త్రొక్కిపెట్టబడి ... 
     బలవంతంగాహత్యకు గురౌ తోంది...! 
...
  వీడిది మనకులం కాదు... 
  వాడు మనమతంవాడుకాడు 
   మనవర్గంవాడైతే  చాలదా !
వేరే అర్హతలింకేం కావాలి... ?!
అదిచాలు మనoవాడ్ని ఆకా శానికి ఎత్తెయ్యటానికి... !

 విద్వత్తుకు విలువ నివ్వక.... 
 పట్టం కట్టాల్సిన ప్రతిభను... 
  ప్రక్కకు నెట్టేస్తుంటే...., 
 చూసి,సహించలేక....
      మానవత్వం క్రుంగి,కృశించి
 ఆత్మహత్య చేసుకుంటోంది.. !!
      ********

కామెంట్‌లు