స్వశక్తి!అచ్యుతుని రాజ్యశ్రీ

రోడ్డు పక్కన చిన్న టెంట్ కింద కూచుని శివా బట్టలు వేసుకుని  బట్టలు కుడతాడు.రిపేర్లు చిరిగిన్ వాటిని కుట్టడం చేస్తాడు.షాపుదర్జీలు చాలా చార్జీ అడుగుతారు.అందుకని అంతా అతని దగ్గరికి వస్తారు. ఇంట్లో భార్య కూడా కుడుతుంది. పిల్లా జల్లాలేరు.ఓసారి ఇద్దరికీ జ్వరంవచ్చింది.నాలుగురోజులు మిషన్ ఎక్క లేకపోయారు.భార్య అంది"అయ్యో! ఆపోశవ్వ బిడ్డ లగ్గం ఇంక నాలుగురోజులే ఉంది. పెళ్లిబిడ్డ జాకెట్లు కుట్టాలి.""ఎవరికైనా ఇవ్వు "."ఆమె కూలీ పైసలు ఇవ్వలేకనే నాతాన ఇచ్చింది. "దిగాలుగా అంది.సరిగ్గా దేవుడు పంపినట్లుగా జయ వచ్చింది. "పిన్ని!నేను టైలరింగు నేర్చుకున్నాను.కుట్టి పెడతా.బుగులు పడకు"అంది.ఆపిల్లకి తల్లి చనిపోతే తండ్రి మారు మనువు చేసుకున్నాడు.హాస్టల్లో ఉండి చదువుకునే ఆపిల్ల దూరపు చుట్టం కావటంతో శివా ఇంటికి సెలవు రోజు వచ్చి పోతుంటుంది.రెండు రోజులు సెలవులిచ్చారు.చూసిపోదామని వచ్చిన  ఆపిల్ల ఆదంపతుల స్థితి చూసి వంటచేసి వారికీ పెట్టి ఓ నాలుగు గంటల్లో ఫ్యాషన్ గా జాకెట్లు కుట్టింది.తెల్లారుతూనే వచ్చిన  పోశవ్వ ఎంతో మురిసి పోయి ఓయాభై రూపాయలు ఎక్కువే ముట్టజెప్పింది."బిడ్డా!దిక్కు లేని వారికి  దేవుడే దిక్కు అంటారు.మాగుండెలమీద బరువు దించావు తల్లీ "అన్న శివా తో" సెలవుల్లో మీకాడనే ఉంటా.మా ఊరుపోను" అంది జయ! అలా పరీక్షలు కాగానే తండ్రి దగ్గరకు పోకుండా  కుట్టు పనితో పాటు తెలుగు డి.టి.పి.నేర్చుకుని ఓపెన్ యూనివర్సిటీ లో చదువు తూ   శివా దంపతులకు చేదోడువాదోడుగా ఉంది. ఇలా కష్టపడి చదువుతూ ఉన్నత స్థాయి లో  ఎదిగిన వారెందరో!శివా దంపతులకు ఆమె దైవం ఇచ్చిన బిడ్డ గా మారింది. విదేశాల్లో పిల్లలు స్వశక్తితో పై చదువులు కొనసాగిస్తారు.మనదేశంలో కూడా స్వయంకృషి శక్తి పై బాగా చదువుకోవాలి అంతా🌷 
కామెంట్‌లు