మౌని ఫ్లెమింగ్!;-- యామిజాల జగదీశ్
 పెన్సులిన్ ఔషధాన్ని కనిపెట్టిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అతి శాంతస్వభావి. ఎవరితోనూ తనంతట తానుగా మాట్లాడడు. మౌని.
ఆయన భార్య సారా మరియోన్ ఓమారు తీవ్ర అనారోగ్యంతో అవస్థ పడుతున్నారు. ఆమె ఇక బతకడం కష్టమని అనుకున్నారు.
అప్పుడు ఆమె సన్నిహితురాలు సారాని అడిగారు "ఒకవేళ నువ్వు చనిపోతే అమాయకుడైన నీ భర్త ఏం చేస్తారు?" అని.
"ఏముందీ...ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు. కానీ ఎవరో ఒకరు తానుగా ముందుకొచ్చి నన్ను పెళ్ళి చేసుకోండి అని ఆయనను అడగాలి. అంతేతప్ప ఆయన అడగరు" అన్నారు సారా.

కామెంట్‌లు