జక్కాపూర్ విద్యార్థులకు పెద్దలు రాసిన పిల్లల కథలు



 మణికొండ వేదకుమార్ సంపాదకత్వం లో రూపొందించబడిన తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల పెద్దలు వ్రాసిన బాలల కథలు అనే పది పుస్తకాలను ఈరోజు సిద్దిపేట జిల్లా జక్కాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య అందచేసారు. పది పుస్తకాలలో మొత్తం 119 కథలు ఉన్నాయని, ఇవి విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందిస్తాయని,ప్రతి పాఠశాల లో తప్పకుండా ఉండవలసిన ఈ 10 పుస్తకములను పంపించిన మణికొండ వేదకుమార్ సర్ గారికి మరో 10 పుస్తకములను అందించిన గరిపెళ్లి అశోక్ సర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు భైతి దుర్గయ్య తెలియచేసారు.

కామెంట్‌లు