సునంద భాషితం ;వురిమళ్ల సునంద, ఖమ్మం
 వ్రతము...వ్రాతము
   ******
వ్రతము అనేది ఎవరికైనా సూనృతమే. వ్రతము ఎప్పుడూ హితమే.ఎంత పెద్ద వ్రాతములో ఉన్నా  ప్రత్యేకతను, ప్రతిష్టను తెచ్చి పెట్టేది వ్యక్తిగా ఆచరించే వ్రతమే.
వ్రతము అనగానే పండుగలు,పబ్బాలకు, ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చేసే నోములు  గుర్తుకు వస్తాయి.కానీ వ్రతం అంటే నోము అనే అర్థమొక్కటే కాదు.
మనిషి నియమనిష్టలకు సంబంధించిన అర్థాలు చాలా ఉన్నాయి.
నియమము,పంతము, ప్రతిజ్ఞ,ఒట్టు, పూనిక,దివ్యము,శపథము,బాస,శంబరము, సంయమనము  మొదలైనవి.
సందర్భానుసారంగా పెద్దలు కొన్ని వ్రతాలను సూచించారు.అందులో కొన్ని వ్యక్తి యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచి, అస్థిత్వాన్ని నిరూపించే వ్రతాలు కొన్ని ఉన్నాయి. అవే సత్యవ్రతము,మౌన వ్రతము,అసిధారా వ్రతము లాంటివి.

సత్య ధర్మ వ్రతము ఆచరించు వ్యక్తి వ్రాతములో మహోన్నతమైన వ్యక్తిత్వ స్వరూపంగా గౌరవం పొందుతాడు.
అసలు వ్రాతము అంటే ఏమిటో చూద్దాం.
వ్రాతము అంటే సమూహము,మంద, గుంపు,గుచ్ఛము,కదంబము,దళము, జుట్టు, బృందము,మూక లాంటి అనేక అర్థాలు ఉన్నాయి.
మానవతా ధర్మ వ్రతాన్ని నియమంగా ఆచరిద్దాం. వ్రాతములో మానవీయ సుమమై విలువల పరిమళాలను వ్యాపింప చేద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు