పురాతన విధానం ; -ఎం. వి. ఉమాదేవి. బాసర

 మోటార్ ప్రయాణసాధనాలు లేనినాడే 
సమాచారం అందించే తీరు 
మానవ ప్రయత్నంలో ఎన్నో ఆటంకాలు 
ఎండా వానలు తుఫాను సుడిగాలుల దాటి 
కాలి నడక, గుర్రం, రథం,పావురం, హంస, డేగ వంటివాటి వినియోగంతో.. 
గొల్లభామలు పెరుగుకుండల్లో దాచిన 
సమాచారం.. శత్రువు కంటబడని విధంగా 
సంకేతం,శబ్దం, నీరు, నిప్పు 
ఎన్నో ప్రకృతి విధానాలు సమాచారనేత్రాలు!
కళాకారులనూ వాడిన సమయంలో 
ప్రాణం కోల్పోయినా వివరం బైట పడనిదీక్ష !
వార్తా హరులు, గూఢచారులు పాదరక్షల్లో దాచేఉత్తరం!
రుక్మిణి అందించిన కీలక  సమాచారం 
శ్రీకృష్ణ కళ్యాణము !!
కామెంట్‌లు