కాల సవరణ (సమ్మోహనాలు )-ఎం. వి. ఉమాదేవి
కాలాన్ని సవరించు 
సవరించి గమనించు 
గమనించగా విలువ తెలిసేను ఓ ఉమా !

ముందు నడపగలేవు 
నడిపి ఆపగలేవు 
ఆపుటకు నీవెవరు అంటుంది ఓ ఉమా !

విలువ తెలియనివారు 
తెలియకే వగచేరు 
వగచుటలు మాత్రమే వారిపని ఓ ఉమా !

రాజులూ రాజ్యాలు 
రాజ్యపు విస్తరణలు 
విస్తరణ అదృశ్యము అయ్యెనే ఓ ఉమా !

కర్తవ్య నిర్వహణ 
నిర్వహణ నిరూపణ 
నిరూపించు కాలం తానౌను ఓ ఉమా !

కామెంట్‌లు