సుప్రభాత కవిత ; -బృంద
నింగి ముంగిట నిండుగా
తూరుపు వాకిట  బంతిలా

కట్టెదుట  నిలిచిన కలిమిలా 
అపరంజి వెలుగుల పువ్వులా

మౌనాలను మీటుతూ
అందాలు చాటుతూ

ఆనందాలు పంచుతూ
అంతరంగాలు తాకుతూ

ఆశారేఖలు పొడిపిస్తూ
సహనాన్ని పొడిగిస్తూ

కళ్ళలో  కలల కళ్ళాపి చల్లి
రంగవల్లికలు రచిస్తూ

రెప్పల ద్వారానికి
ముత్యాల తోరణం కడుతూ

వదలని తోడౌతూ
వడలనీక నీడౌతూ

వేలుపట్టుకు నడిపించే
కనపడని నేస్తంలా

లాలనగా తీరం వేపు 
దారి చూపుతూ
దీవెనలిచ్చే దినకరుడి కరుణ

నిండుగా పొందగలిగే
వరమిమ్మంటూ  మేలిపొద్దులకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు