@నీకు మోక్షం సూన్యం... ;-* చిత్రకవిత * కోరాడ నరసింహా రావు !
రహస్యమంతా.... 
  మూసిన పిడికిలి లోనే... !

బిగిసిన పిడికిలి..లక్ష్య సాధన కు కార్యోన్ముఖ చిహ్నమోయి !!

పిడికిలితోఉన్న అర్ధ - పరమార్ధ 
ములను గ్రహించవోయి.... !

పంచభూతాత్మకుడవీవు... 
  పిడికిలి లోనే ఉన్నావు... !!

,ప్రకృతితో నువ్ స్నేహిస్తేనే... 
  హాయిగ నిద్దుర పోగలవు... !
 
అర్థమిదియే... 
      పరమార్ధము వినుము...!

ఆ చూపుడువేలే ఆత్మవైన నీవు 
 చిటికెన, అంగుళీ, మధ్య.... 
  మూడువేళ్ళునూ...సత్వ, రజ
స్తమో గుణములోయి.... !

 నీ త్రిగుణమ్ములతో కలసి నీవు  పరమాత్మకు  ప్రతిరూపమైన ఆ 
బొటనవ్రేలుకు సంపూర్ణ శరణాగతితో,వస్యుడవగుటయే  పిడికిలి కర్ధం .... !. 
 
.  బొటనవేలు లేనిదే.... 
  నాలుగువేళ్ళూ  నిర్వీర్యం !
  పరమాత్మ  కరుణించనిదే... 
  ఆత్మవైన నీకు మోక్షం సూన్యం
      *******

కామెంట్‌లు