- ఎల్లలు లేని.... !(బాలగేయం :)--కోరాడ నరసింహా రావు.
ఎల్లలు లేని.... 
   పిల్లల అల్లరి... 
 భరించటమెంతో  కష్టం.. !
  ఓర్పు - నేర్పు ఉన్న తల్లులకు
  కాదది పెద్ద  కష్టం... !!

వద్దని నిర్బంధిస్తే.. పిల్లలు 
  మరింత రెచ్చిపోతారు !
 అందమైన ఇంటిని వారు 
  కిస్మిoదగా మార్చేస్తారు !!

పిల్లలు అల్లరి చేసేటప్పుడు... 
 తెలివిగా ప్రవర్తించాలి... !
 మాట మారుస్తు  వాళ్లు ... 
  చేసే అల్లరిని మరిపించాలి..!!

పిల్లలతో... మనమూ.... 
  పిల్లల్లా  ప్రవర్తించాలి !
ఆటలు  -  పాటలతో... 
 మనము వారితో కలిసిపోవాలి 

కధలు - కబుర్లు చెబుతూ... 
 వారిని మంచిదారిలో పెట్టాలి 
పాఠాన్నైనా  కధలా చెబుతూ 
ఆసక్తిని వారిలో పెంచాలి.. !!

గొప్పవ్యక్తుల జీవితాలను... 
 పిల్లలకు తెలియజేయాలి !
 దేశభక్తిని -  దైవభక్తిని.... 
  వారిలో  కలిగించాలి... !!

శ్రద్దా, బుద్దులు నేర్పి వారిని 
 క్రమశిక్షణలో పెంచాలి... !
  చక్కని చదువులు చదివి... 
  వారు ఉత్తమపౌరులుకావాలి 
       ******

కామెంట్‌లు